collapse
...
జాతీయం
   Delhi suicides: నిరాశ నిండిన జీవితం.. గ్యాస్ చాంబర్ లో పరిసమాప్తం

   Delhi suicides: నిరాశ నిండిన జీవితం.. గ్యాస్ చాంబర్ లో పరిసమాప్తం

   2022-05-22  News Desk
   నిరాశ, ఒంటరి తనం ఆవహిస్తే.. ఎవరైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. బతుకు మీద ఆశ, బతకాలనే కోరిక లేనప్పుడు కన్నుమూయడమే కరెక్ట్. కచ్చితంగా ఇదే అనుకున్నారు.. తల్లి, తన ఇద్దరు పిల్లలు. ఇంటిని గ్యాస్ చాంబర్ గా మార్చుకున్నారు. ప్రమాదకరమైన వాయువు పీల్చి కన్నుమూశారు.
   'మీ ఇటాలియన్ గ్లాసెస్ తీసేసి దేశంలోని అభివృద్ధిని చూడండి'.. రాహుల్ గాంధీకి అమిత్ షా చురక

   'మీ ఇటాలియన్ గ్లాసెస్ తీసేసి దేశంలోని అభివృద్ధిని చూడండి'.. రాహుల్ గాంధీకి అమిత్ షా చురక

   2022-05-22  News Desk
   కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ఇటాలియన్ గ్లాసెస్ తీసేసి దేశంలో జరుగుతున్న అభివృద్దిని చూడాలని హోం మంత్రి అమిత్ షా కోరారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ వంటివారు తమ కళ్ళు మూసుకుని ఈ దేశ ప్రగతిని చూడడం లేదని ఆయన చెప్పారు. వారు దయచేసి ఇండియన్ గ్లాసెస్ (భారతీయ కళ్లజోడు) ధరించి అభివృద్ధిని చూడాలని కోరుతున్నానని ఆయన చెప్పారు.
   మంకీపాక్స్ పై సైంటిస్టులు, డ‌బ్ల్యుహెచ్ ఓ అయోమ‌యం..భార‌త్ అప్ర‌మ‌త్తం

   మంకీపాక్స్ పై సైంటిస్టులు, డ‌బ్ల్యుహెచ్ ఓ అయోమ‌యం..భార‌త్ అప్ర‌మ‌త్తం

   2022-05-22  News Desk
   రెండు సంవత్సరాలకు పైగా కోవిడ్-19 తో అత‌లాకుత‌ల‌మై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న త‌రుణంలో *మంకీపాక్స్‌* అనే మరో వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మ‌సూచి వంటి వ్యాధిలా క‌న‌బ‌డుతున్న మంకీపాక్స్ ఇన్ఫెక్ష‌న్ ప‌ట్ల భారతదేశం కూడా అప్రమత్తమ‌వుతోంది. తాజాగా ఐరోపాలో ఈ ఇన్‌ఫెక్ష‌న్ కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.
   కుతుబ్ మీనార్ తవ్వకానికై పురాతత్వ శాఖకు కేంద్రం ఆదేశాలు..

   కుతుబ్ మీనార్ తవ్వకానికై పురాతత్వ శాఖకు కేంద్రం ఆదేశాలు..

   2022-05-22  News Desk
   వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి వివాదం దేశంలో ఇంకా కొనసాగుతుండగానే.. తాజాగా ఢిల్లీలోని కుతుబ్ మీనార్ వంతు వచ్చింది. ఈ కట్టడం తవ్వకం పనులు చేపట్టాలని, మీనార్ కాంప్లెక్సులో విగ్రహాల ఆనవాళ్లు ఉన్నాయేమో కనుగొనాలని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (పురాతత్వ శాఖ) ను కోరింది.
   గోధుమ గింజలకు కొరత లేదు

   గోధుమ గింజలకు కొరత లేదు

   2022-05-22  News Desk
   ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు ఎలాంటి కొరత లేదని భారత్‌ వాదిస్తోంది. ఆహార కొరతతో కొన్ని దేశాలు ఉదాహరణకు ఈజిప్టు లాంటి దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) సభ్యదేశాలకు భారత్‌ తెలిపింది. ఎగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించడంతో భారత్‌ను పేరు పెట్టి అవమానించడం తగదని హెచ్చరించింది.
   పీహెచ్‌డీ ఉన్న ప్రొఫెసర్లు కొత్త జ్ఞానాన్ని అందించగలరా..!?

   పీహెచ్‌డీ ఉన్న ప్రొఫెసర్లు కొత్త జ్ఞానాన్ని అందించగలరా..!?

   2022-05-22  News Desk
   హెచ్‌డీ డిగ్రీ కలిగివున్న ప్రొఫెసర్లు మెరుగ్గా బోధన చేయగలరా ? పుస్తకాల వెలుపలి జ్ఞానాన్ని సముపార్జించడంలో యూనివర్సిటీ విద్యార్థులకు తోడ్పాటునందించగలరా ? ..
   పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేముందు కేంద్రం రాష్ట్రాలను అడిగిందా ..? తమిళనాడు చురక

   పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేముందు కేంద్రం రాష్ట్రాలను అడిగిందా ..? తమిళనాడు చురక

   2022-05-22  News Desk
   దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేముందు కేంద్రం.. రాష్ట్రాలను సంప్రదించిందా అని తమిళనాడు ప్రభుత్వం ప్రశ్నించింది. ఇప్పుడు వీటిపై ఎక్సయిజు సుంకాలను తగ్గించి.. వ్యాట్ ను తగ్గించాలంటూ రాష్ట్రాలను కోరుతోందని తమిళనాడు ఆర్ధిక మంత్రి పి. త్యాగరాజన్ విమర్శించారు.
   గోవాకు చాపర్ సర్వీసులు విస్తరించిన బ్లేడ్

   గోవాకు చాపర్ సర్వీసులు విస్తరించిన బ్లేడ్

   2022-05-22  News Desk
   హెలికాప్టర్ రవాణా కంపెనీ అయిన బ్లేడ్ తన చాపర్ సర్వీసులను గోవాలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానికులకు, టూరిస్టులకు రైడింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్ సేవలు గోవా విమానాశ్రయం నుంచి ఉత్తర గోవాకు, దక్షిణ గోవాకు, పాత గోవాకు కనెక్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది.
   త‌గ్గిన ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌రి ఈ సారైనా త‌గ్గిస్తాయా తెలుగు రాష్ట్రాలు ?

   త‌గ్గిన ఇంధ‌న ధ‌ర‌లు.. మ‌రి ఈ సారైనా త‌గ్గిస్తాయా తెలుగు రాష్ట్రాలు ?

   2022-05-22  News Desk
   దేశంలో ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై వ్య‌క్త‌మ‌వుతున్న ప్ర‌జాగ్ర‌హాన్ని గ‌మ‌నించిన కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. వీటిపై ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించింది. దీంతో ప‌లు రాష్ట్రాలు కూడా పెట్రోలు, డీజిల్ పై విలువ ఆధారిత ప‌న్న‌ను (వ్యాట్) త‌గ్గిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాజస్థాన్, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి.
   మౌంటైన్ లైన్‌తో తలపడి యజమానిని కాపాడిన శునకం

   మౌంటైన్ లైన్‌తో తలపడి యజమానిని కాపాడిన శునకం

   2022-05-22  News Desk
   శునకాలు మనుషుల ఉత్తమ స్నేహితులు అనడంలో సందేహమే లేదు. ఇంటర్నెట్‌లో దీనికి అనేక నిదర్శనాలు కనబడుతున్నాయి. పర్వత సింహంతో తలపడిన ఒక శునకం నేరుగా తన యజమాని ప్రాణాలనే కాపాడి ఔరా అనిపించింది. ఆ శునకం వయస్సు రెండున్నర సంవత్సరాలు మాత్రమే. ఉత్తర కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది.
   చమురు ధరలు తగ్గించిన ఇండియాకు హ్యాట్సాఫ్..... పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

   చమురు ధరలు తగ్గించిన ఇండియాకు హ్యాట్సాఫ్..... పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

   2022-05-22  News Desk
   పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించిన ఇండియాను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదని, రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ... రష్యా నుంచి ఇండియా డిస్కౌంట్ పై ఆయిల్ దిగుమతులు చేసుకుంటూనే ఉందని ఆయన అన్నారు.
   CM KCR: కేసీఆర్ కు నచ్చిన ఢిల్లీ విద్యా విధానం.. ఇవాళ్టి నుంచి వరుస పర్యటనలు

   CM KCR: కేసీఆర్ కు నచ్చిన ఢిల్లీ విద్యా విధానం.. ఇవాళ్టి నుంచి వరుస పర్యటనలు

   2022-05-22  News Desk
   ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా ఢిల్లీ తరహా విద్యా వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఢిల్లీ తరహా విధానాన్ని అమలు చేయకపోయినా.. తెలంగాణ టీచర్లను ఢిల్లీకి పంపి ఓరియెంటేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.