collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / Special Trains: తిరుమలకు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడ ఆగుతాయంటే? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu Ne...

Special Trains: తిరుమలకు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడ ఆగుతాయంటే?

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Tirupati Railway Station
వేసవి సెలవులు అయిపోవస్తున్న  నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమల గిరులపై రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా భక్తలు రాక తగ్గలేదు. దీనికి తోడు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.  వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్న వేళ.. వారికి అదనపు సౌకర్యం కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సుమారు 20 ప్రత్యేక రైళ్లను శ్రీవారి భక్తుల కోసం నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్‌, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

*ప్రత్యేక రైళ్లు ఎక్కడ ఆగుతాయంటే?  

తిరుపతి- హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలలిపారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి. అటు తిరుపతి- కాకినాడ టౌన్‌ మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అటు కాచిగూడ- తిరుపతి మధ్య రెండు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైలు జూన్ 1, జూన్ 2న వెళ్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.  ఈ ప్రత్యేక రైళ్లు.. ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   
అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు కంటే మించిన రద్దీ తిరుమల కొండపై నెలకొంది.  తిరుగిరుల్లో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండింతలు అధికంగా ఉన్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్లు గానీ, గదులు గానీ ఖాళీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని వెల్లడించారు.  అటు తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా  వీఐపీ బ్రేక్ దర్శనలను  సైతం రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.  

* వేసవి సెలవులు దగ్గర పడటంతో పెరిగిన రద్దీ   
వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.  సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు  సైతం గత కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం.. గంటల తరబడి సమయం పడుతోంది. చాలా మంది భక్తులు  గదులు దొరక్క, దర్శనం ఆలస్యమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు రైళ్ల మూలంగా ఇంకా భక్తుల రద్దీ పెరిగే సమస్య ఉంది.



2022-05-31  News Desk