collapse
...
Tag: Violence
  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

  2022-06-04  News Desk
  అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
  ప్రముఖ పంజాబీ గాయకుడు దారుణ హత్య

  ప్రముఖ పంజాబీ గాయకుడు దారుణ హత్య

  2022-05-29  News Desk
  కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు జీపులో వెళుతున్న ఆయన్ని ఏకే 47 తుపాకితో కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
  యాసిన్ మాలిక్ కు యావజ్జీవ ఖైదు

  యాసిన్ మాలిక్ కు యావజ్జీవ ఖైదు

  2022-05-25  News Desk
  ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు యావజ్జీవ శిక్ష పడింది.10లక్షల జరిమానాను పాటియాలా హౌస్ కోర్టు విధించింది.యాసిన్ మాలిక్ ఉరిశిక్షనే సరైనదని ఎన్ ఐ ఏ కోర్టుకు సూచించింది.అయితే యావజ్జీవ శిక్ష వేయాలని డిఫెన్స్ లాయర్లు కోరారు.చివరి శ్వాస వరకు జైలులోనే ఉంచాలని న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ తీర్పునిచ్చారు.
  హింసతో అట్టుడుకుతున్న లంక....

  హింసతో అట్టుడుకుతున్న లంక....

  2022-05-10  International Desk
  ఆందోళనకారుల హింసతో శ్రీలంక అట్టుడుకుతోంది. కొలంబో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రెచ్చిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, వాహనాలకు నిప్పు పెడుతున్నారు. మాజీ ప్రధాని మహీందా రాజపక్సే నివాస భవనాన్ని వీరు ముట్టడించడంతో ఆయనను, ఆయన కుటుంబాన్ని సైనికులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.
  చైనాలో నరకం చూస్తున్న షాంఘై వాసులు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు

  చైనాలో నరకం చూస్తున్న షాంఘై వాసులు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు

  2022-05-05  International Desk
  చైనాలోని షాంఘైలో కోవిడ్ అదుపు కోసం అధికారులు అత్యంత కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. జీరో-కోవిడ్ పాలసీని అమలు చేయాలన్న లక్ష్యం ఏమోగానీ అమాయక ప్రజలను నానా విధాలుగా హింసిస్తున్నారు. వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, వారి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు వారికి నరకం చూపుతున్నారు.
  ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు... అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆక్రోశం

  ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు... అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆక్రోశం

  2022-05-03  International Desk
  ప్రపంచవ్యాప్తంగా ముస్లిములను టార్గెట్ చేస్తున్నారని, వారు హింసకు గురవుతున్నారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. తమకు సమాజంలో ఎన్ని సవాళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నా ప్రతిరోజూ వారు అమెరికాను బలోపేతం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈద్ సందర్భంగా ముస్లిములకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ..
  జహంగీర్ పురిలో మళ్లీ హింస.. పోలీసులపై రాళ్ల వర్షం

  జహంగీర్ పురిలో మళ్లీ హింస.. పోలీసులపై రాళ్ల వర్షం

  2022-04-18  News Desk
  హనుమాన్ జయంతి నాడు ఢిల్లీ లోని జహంగీర్ పురిలో రేగిన హింసాకాండ తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభించింది. క్రమంగా ఇది మత ఘర్షణల రూపం దాలుస్తోంది. ఈ ప్రాంతంలో సోమవారం ఒక వర్గం వారు పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. శనివారం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర సాగుతుండగా సోను అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఒక పోలీసు అధికారి సహా కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
  JNU: చదువుల కన్నా కొట్టుకోవడమే ఎక్కువ

  JNU: చదువుల కన్నా కొట్టుకోవడమే ఎక్కువ

  2022-04-11  News Desk
  అలవాట్లు మహా చెడ్డవి. ఆహారమైనా, విహారమైనా, ఎవరి అలవాట్లు వారికి ఎంత ఇష్టమంటే వాటి కోసం రక్తపాతం సృష్టించడం కూడా సర్వసాధారణం. అదే పది మంది కలిసి జీవిస్తూ, చదువుకోవలసిన విద్యార్థులు ఆహారం మీద తమకున్న ఆసక్తిని ఒక్కరోజు వదులుకోలేకపోవడం (బహుశా ఇతరులు వారిని అనుమతించకపోవడం) తాజాగా వివాదాన్ని రేకెత్తించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిత్యం ఈ తరహా ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి.
  శ్రీలంకలో హింసాకాండ... తీవ్రవాదుల పనేనంటున్న అధ్యక్షుడు రాజపక్ష

  శ్రీలంకలో హింసాకాండ... తీవ్రవాదుల పనేనంటున్న అధ్యక్షుడు రాజపక్ష

  2022-04-01  International Desk
  తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శీలంకలో ప్రజలు రెచ్చిపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతోను, పెట్రోలు, డీజిల్ నిల్వలు తరిగిపోతుండడంతోను, గంటల తరబడి విద్యుత్ సరఫరా కోతలతోను అల్లాడిపోతున్న వారు శుక్ర వారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష నివాసాన్ని ముట్టడించారు.
  ఆ మారణ కాండకు కారకులెవరు?

  ఆ మారణ కాండకు కారకులెవరు?

  2021-11-26  News Desk
  మణిపూర్ లో నవంబర్ 13న జరిగిన ఘాతుకానికి తామే బాధ్యులమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఏ), మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎం.ఎన్.పిఎఫ్) ప్రకటించాయి.