6tvnews

collapse
...
Home / జాతీయం / TransGender: చావు కోరింది...బతుకు పొందింది

TransGender: చావు కోరింది...బతుకు పొందింది

2022-01-14  News Desk

facebook 2-1
 

హక్కులకు అనుగుణంగా  చేసుకున్న లింగమార్పిడి అవమానాలను తెచ్చిపెట్టింది.. ఉన్న ఉద్యోగం వదులుకు నేలా చేసింది.. బతుకుభారంగా మారింది.. ఫలితంగా పూట గడవని పరిస్థితి చేరింది.. ఈ క్రమంలో తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది ఓ ట్రాన్స్ విమెన్. రంగంలోకి దిగిన ప్రభుత్వం ఆమెకు దారి చూపింది. ఆసక్తికరమైన ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాలివి..

అతడి నుంచి మారిన…ఆమె కథ..   
కేరళ రాష్ట్రానికి చెందిన అనీరా కబీర్ లింగ మార్పిడి చేసుకుని మహిళ గా మారింది. చదువుపై మొదటినుంచి ఆసక్తి ఉండడంతో మంచి విద్యార్థిగా గుర్తింపు పొందింది. డబుల్ గ్రాడ్యుయేట్ ను పూర్తి చేసింది. ఎంఈడీ చేసింది .అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్ష సెట్ లో  ఉత్తీర్ణత సాధించింది. తన ప్రతిభతో ఇంత ఎదిగినా ఉద్యోగ సాధనలో మాత్రం ఈమెకు ఇబ్బందులు తప్పలేదు. ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు ఈ పోస్టు కోసం మగ వేషధారణలో వెళ్లి ఉద్యోగం సాధించింది. కానీ ఆమె గురించి తెలియడంతో పాఠశాలలో అవమానాలు మొదలయ్యాయి. ఆమెను చేసే విధానం మారిపోయింది. దీనిని భరించలేక ఉన్న ఉద్యోగం మానేసింది. దీంతో బతుకుబండి నడవడమే మహా కష్టంగా మారింది. తనకు మరణమే శరణ్యమని ఆమె భావించింది.

చనిపోనివ్వండి ప్లీజ్..   
తనను సమాజం బ్రతక నివ్వడం లేదు.. బ్రతికే పరిస్థితి కూడా లేదు.. నాకు చనిపోయేందుకు అవకాశం కల్పించండి.. ఇది కోర్టుకు ఆమె చేసిన విజ్ఞప్తి. పూట గడవని పరిస్థితి ఏర్పడటంతో చనిపోవాలని నిశ్చయించుకున్న ఆమె  లీగల్ సర్వీసెస్ అథారిటీ ని ఆశ్రయించింది. వారి సాయంతో కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ కేరళ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం విద్యా శాఖ దృష్టికి వెళ్లడంతో అక్కడి విద్యా శాఖ మంత్రి శివన్ కుట్టి ఆమెను పిలిపించి ప్రభుత్వ విద్యా శాఖలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష, కేరళ ప్రాజెక్టులో ఆమెను ఉద్యోగిగా నియమించి నెలరోజుల్లో శాశ్వత ఉద్యోగిగా గుర్తిస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.


2022-01-14  News Desk